➤Group-III Panchayat Raj Secretary - Scheme and Syllabus

                           

              గ్రూపు-3 (పంచాయతీ కార్యదర్శి- గ్రేడ్‌-4) నియామక పరీక్షలోనూ రెండంచెల విధానాన్ని ఏపీపీఎస్సీ అనుసరించనుంది. ప్రాథమిక (స్క్రీనింగ్‌), ప్రధాన పరీక్ష (మెయిన్‌)ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ప్రాథమిక పరీక్షలో 150 ప్రశ్నలను 150 మార్కులకు ఇవ్వనుంది. ప్రధాన పరీక్షను 300 మార్కులకు నిర్వహించనుంది. ఇందులో పేపరు-1 150 మార్కులకు, పేపరు-2 150 మార్కులకు ఉంటుంది. ప్రతి ఒక ప్రశ్నకు ఒక మార్కును కేటాయిస్తారు. గ్రూపు-3 పోస్టులు ఏపీపీఎస్సీ వద్ద ప్రస్తుతం 1054 వరకున్నాయి. ఈ నెలాఖరులోగా ఉద్యోగాల భర్తీ ప్రకటన జారీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ఈ సందర్భంగానే పాఠ్య ప్రణాళికను సైతం ఖరారు చేసింది. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగమైనందున సిలబస్‌లో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాలపై ప్రశ్నలు ఎక్కువగా రానున్నాయి. స్క్రీనింగ్‌ టెస్ట్‌ సిలబస్‌లోని అంశాలే ప్రధాన పరీక్షలోనూ ఉంటాయి. స్క్రీనింగ్‌ టెస్ట్‌ సిలబస్‌ ప్రాథమిక స్థాయిలో, ప్రధాన పరీక్ష సిలబస్‌ విస్తృతంగా ఉంటుంది. 


 🔹జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు, మానవుల దైనందిన కార్యకలాపాల్లో సైన్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఐటీ రంగాల్లో వర్థమాన అభివృద్ధి అంశాలు, ఆధునిక భారతదేశ చరిత్ర, స్వాతంత్య్రం అనంతరం భారతదేశ అభివృద్ధి, భారత రాజ్యాంగం, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో పాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయరంగాల్లో వచ్చిన మార్పులు, సమస్యలు, పంచాయతీరాజ్‌ వ్యవస్థ తీరు, పంచాయతీరాజ్‌ ద్వారా చేపడుతున్న ముఖ్యమైన పథకాలు, గ్రామీణ, ఆర్థిక, వ్యవసాయ, చిన్నతరహా పరిశ్రమలు, స్వయంసహాయ బృందాల ఆర్థికాభివృద్ధిపై ప్రశ్నలు ఇవ్వనున్నారు. 

🔹ప్రధాన పరీక్ష పేపరు-1: జాతీయ విపత్తు నిర్వహణ (సీబీఎస్‌ఈ బోర్డుకు చెందిన ఎనిమిది, తొమ్మిదో తరగతి స్థాయి), ఏపీ భౌగోళిక అంశాల ప్రాధాన్యం, రాష్ట్ర విభజన అనంతరం వివిధ రంగాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, రాజధాని కోల్పోవడం, నూతన రాజధాని నిర్మాణంలో ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యమైన సంస్థల పునర్నిర్మాణం, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో మార్పులు, ఉద్యోగుల విభజన, స్థానిక అంశాలు, ఆర్థిక వనరుల సమీకరణలో సమస్యలు, ఏపీ పునర్విభజన చట్టం రూపకల్పన.. అందులో పొందుపరిచిన అంశాలు, ఇతరాలపై ఇవ్వనున్నారు. 

🔹పేపరు-2: పంచాయతీరాజ్‌ విధానం, పంచాయతీ కార్యదర్శి విధులు బాధ్యతలు, గ్రామీణ పేదల అభివృద్ధికి పథకాలు, పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా అమలయ్యే కీలక పథకాలు, గ్రామీణ ఆర్థిక వృద్ధి, స్థానిక సంస్థల్లో ఆదాయవ్యయాల వ్యవహారాలు తదితరాలు.
➤CLICK HERE TO DOWNLOAD THE DETAILED SYLLABUS

No comments:

Post a Comment